News

హోదాతో పాటు ప్యాకేజీ కూడా


ఏపీ టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రత్యేక హెదాపై భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల ఏపీ నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా అవసరమన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే తీసుకుంటాం.. ఆ తర్వాత ప్రత్యేక హోదాకోసం ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇచ్చింది తీసుకోవడం రాని దానికోసం ప్రయత్నం చేయడమనేది విజ్ఞతభావమని డొక్కా స్పష్టం చేశారు. అంతేకానీ ఇచ్చింది వద్దు రానిదాని కోసం ప్రయత్నం చేద్దాం లేకపోతే అన్నీ ఇచ్చినప్పుడే తీసుకుందామని కొన్ని పత్రికల్లో, రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్నాయి అవి చాలా అన్యాయమన్నారు.